
247views
అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తరుణంలో ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు హిందు-ముస్లింల మధ్య మతసామరస్యానికి నిదర్శనంగా నిలిచే నిర్ణయాన్ని వెలువరించింది. వక్ఫ్‌బోర్డుకు అనుబంధంగా పనిచేసే మదర్సాలలో మార్చి నుంచి అనుసరించే నూతన పాఠ్యప్రణాళికలో హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి కథను చేరుస్తామని గురువారం ప్రకటించింది. మహమ్మద్ ప్రవక్త జీవిత గాథతో పాటు రామకథను విద్యార్థులకు బోధిస్తామని బోర్డు ఛైర్మన్, షాదాబ్ షామ్స్ వెల్లడించారు. ముస్లిం పెద్దలు ఈ చర్యకు తమ ఆమోదం తెలిపారని ఆయన వివరించారు. శ్రీరాముడు పాటించిన విలువలు మతాలకతీతంగా అందరూ అనుసరించదగినవని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు పరిధిలో మొత్తం 117 మదర్సాలు పరిచేస్తున్నాయి. అధునాతన పాఠ్యప్రణాళికను ముందుగా డెహ్రాడున్, హరిద్వార్, ఉధంసింగ్ నగర్, నైనితాల్ జిల్లాల్లో అమలు చేస్తామని షాదాబ్ వివరించారు.





