News

ఇప్పుడు అప్పట్లా కాదు – పాక్ కు వార్నింగ్ ఇచ్చిన ఆర్మీ చీఫ్ రావ‌త్‌

580views

శ‌తృదేశ‌మైన పాకిస్థాన్‌కు ఆర్మీచీఫ్ బిపిన్ రావ‌త్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్గిల్ సమయంలో లాగా పాకిస్థాన్ ప్రస్తుతం చొరబాట్లను ప్రేరేపించదని, ఒక వేళ పాక్ 1999 కార్గిల్ యుద్ధం సమయంలో మాదిరిగా ప్రస్తుతం చొరబాట్లకు పాల్పడితే తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదంటూ హెచ్చ‌రించారు. భారత జవాన్లు సరిహద్దుల వెంబడి నిత్యం పహరా కాస్తూనే ఉన్నారన్నారు. కార్గిల్ వార్ జరిగి ఇరవయ్యేళ్ళు అయిన సందర్భంగా మాట్లాడిన బిపిన్ రావత్ బోర్డర్‌లో నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఇకపై పాక్ చొరబాట్లను ప్రేరేపించదని ధీమా వ్యక్తం చేశారు.