
404views
సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ధనుర్మా సాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కృష్ణ ధర్మ పరిరక్షణ సమితి ప్రతినిధులు బుధవారం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ పర్యవేక్ష ణలో పలువురు ఆధ్యాత్మికవేత్తలు, సుమారు 650 మంది హరిదాసులు, సనాతన హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఇంద్రకీలాద్రికి చేరుకు న్నారు. తొలుత ఘాట్రోడ్డులోని కామలేను అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరి కుమ్మరిపాలెం, సీతారా, కబేళా, పాలప్రాజెక్టు, బ్రాహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరు కున్నారు. ఆధ్యాత్మిక వేత్తలను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి ప్రసాదాలు అందజేశారు





