News

ఆర్​ఎస్​ఎస్​ సర్ సంఘచాలక్‌ మోహన్ భగవత్‌కు అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఆహ్వానం

349views

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్- ఆర్​ఎస్​ఎస్​ సర్ సంఘచాలక్ డాక్టర్.మోహన్ భగవత్ కు బుధవారం అహ్వానం అందింది. ఈ మేరకు అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింట్ ప్రెసిడెంట్ అలోక్​ కుమార్​ దిల్లీలోని భగవత్ ఇంటికి వెళ్లి ఆహ్వానం అందించారు.

ఈ మేరకు సర్ సంఘచాలక్ డాక్టర్.మోహన్ భగవత్ మాట్లాడుతూ, శ్రీరామమందిర ప్రాణప్రతిష్ఠలో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప అదృష్టమని అన్నారు. “చాలా ఏళ్ల తర్వాత మనం భారత్​ స్వీయ చిహ్నాన్ని పునర్నిర్మించాము. మనం ధర్మబద్ధంగా చేసిన ప్రయత్నాల కారణంగా అది సాధ్యమైంది. ఇది ఒక విధంగా భారత్​ తనంతట తానుగా నిలబడిందని, ఇప్పుడు ప్రపంచ శ్రేయస్సు, శాంతి కోసం ముందుకు సాగుతుందని ప్రపంచానికి చాటి చెప్పడం. ఈ ప్రాణప్రతిష్ఠ ద్వారా ఎన్నో దశాబ్దాలుగా వెతుకుతున్న దిశను మనం కొనుగొన్నాము.” అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.