News

ఉత్తరప్రదేశ్ లో దారుణం సాధువుకు నిప్పంటించిన దుండగులు

203views

ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ ఆశ్రమంలో 20 ఏళ్ల యువ సాధువుకు కొందరు దుండగులు నిప్పంటించారు. గుర్సహాయంజ్లోని జలేశ్వర్ ఆశ్రమంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు సాధువు శివ మన్ను కాపాడి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నంబర్గర్ కుమారులు అనిల్, అలోక్, సాధు రామేశ్వర్ దాస్, రఘునాథ్ దాస్, భోళాదాస్ తనకు నిప్పటించారని సాధువు శివమ్ పోలీసులకు చెప్పారు. ఆశ్రమ మహంత్ నియామకం విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు ప్రాథమికంగా గుర్తించారు.