
262views
భారత వాయుసేన మరో ఘనత సాధించింది. పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలోని కార్గిల్ వైమానికతలంపై (ఎయిర్ స్ట్రిప్) తొలిసారి సి-130జె రవాణా విమానాన్ని రాత్రివేళ దించింది. సముద్రమట్టానికి 10,500 మీటర్ల ఎత్తులో ప్రతికూల భౌగోళిక, వాతావరణ పరిస్థితుల మధ్య ఈ వైమానిక స్థావరం ఉంది. అక్కడ దిగిన సి-130జె విమానంలో వాయుసేనకు చెందిన గరుడ్ కమాండోలు ప్రయాణించారు. ఈ ప్రాంతంలో ఈ విన్యాసాన్ని నిర్వహించడం ద్వారా వాయుసేన తన పోరాట సామర్థ్యాన్ని చాటింది. గతంలో ఇక్కడి నుంచి యుద్ధవిమానాలు రాకపోకలు సాగించాయి. అయితే, భారీ రవాణా విమానం రాత్రివేళ దిగడం ఇదే మొదటిసారి. ఇందుకోసం సి-130జె.. ‘టెరైన్ మాస్కింగ్’ విధానాన్ని కూడా ఉపయోగించింది.





