News

హిందూ ఐకమత్యానికి నడుంబిగించాలి

200views

హిందూ ఐకమత్యానికి నడుంబిగించాలని విజయవాడ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న తాళ్లూరి కల్యాణ మండపంలో ఆజాద్‌ హిందూ బోర్డ్‌, వాసవి ఇంటర్నేషనల్‌ పరివార్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా శివస్వామి అనుగ్రహ భాషణం చేశారు.రాష్ట్రంలో 4.30 లక్షల ఎకరాల దేవాలయ భూములు ఉండగా లక్ష ఎకరా లను రాజకీయ నాయకులు, పెద్దలు దోచుకున్నారని ప్రభుత్వాల మెడలు వంచి వాటిని వెనక్కి తేవ డమే ఆజాద్ హిందూ బోర్డు లక్ష్య మని శ్రీశైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీశి వస్వామి సష్టం చేశారు. గుడివాడ మండల మల్లాయపాలెంలోని తాళ్లూరి కల్యాణ మండపంలో ఆజాద్ హిందూ బోర్డు, వాసవీ ఇంటర్నేషనల్ పరివార్ల సంయుక్త ఆధ్వర్యంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. శివస్వామి మాట్లాడుతూ మక్కా, జెరూసలేం యాత్రలకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్నట్లే అమర్నాథ్, కాశీ, మానస సరోవర్ యాత్రలకు వెళ్లే హిందువులకు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతల చేతుల్లో ఉన్న లక్ష ఎకరాల దేవాలయ భూములను వెనక్కి తీసుకురావడా నికి అజాద్ హిందూ బోర్డు ద్వారా 126 మంది న్యాయ వాదులతో కోర్టును ఆశ్రయించామన్నారు.

హిందూ ధర్మ ప్రచారకుడు చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల హిందువులను ఆదుకోవాలని సూచించారు. ఆత్మీయ అతిథి చికోటి ప్రవీణ్‌ మాట్లాడుతూ గుడివాడలో గోపరిరక్షణకు తనవంతు సహాయం అందిస్తానన్నారు.హిందూ ధర్మ పరరిక్షణకు తాను ప్రాణాలు పణంగా పెట్టయినా పోరాడతానని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. బ్రహ్మపథం విశ్వధర్మ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాచార్య స్వామి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రుద్రయోగీశ్వరానంద స్వామి, నవశక్తి క్షేత్రం పీఠాధిపతి శ్రీభవాని శంకరా నంద స్వామిలు ప్రసంగించారు.

బ్రహ్మపథం విశ్వధర్మ పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమాచార్యులు, యోగసాధకుడు, బ్రహ్మపథం విశ్వధర్మ పరిరక్షణ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రుద్రయోగీశ్వరానందస్వామి, నవశక్తి క్షేత్రం పీఠాధిపతి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీశంకరానందస్వామి, శతాధిక ప్రతిష్టాచార్య పండితుడు చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు, సుప్రీంకోర్టు అడ్వకేట్‌ జూపూడి రంగరాజు, వాసవీ ఇంటర్నేషనల్‌ పరివార్‌ అధ్యక్షుడు వేముల హజరత్తయ్యగుప్తా పాల్గొన్నారు. అనంతరం పెద ఎరుకపాడులోని దళితవాడలో అన్నవరపు శ్రీనివాసరావు ఇంట్లో స్వాములు సహపంక్తి భోజనాలు చేశారు.