News

యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది : కేరళ క్యాథలిక్ చర్చి

863views

అంతర్జాతీయ యోగా దినోత్సవం పూర్తై దాదాపు ఓ వారం గడిచిన తర్వాత కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (KCBC) క్రైస్తవులకు కొన్ని మార్గానిర్దేశాకాలను జారీ చేసింది. క్రైస్తవులెవరూ యోగా,ధ్యానం చెయ్యడాన్ని వ్యతిరేకించవలసిన పని లేదని అందులో పేర్కొన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కూడా వాళ్ళు పేర్కొనడం గమనార్హం.

అయితే అదే సమయంలో క్రైస్తవులెవరూ హిందూత్వం వైపు మరళకుండా జాగ్రత్త వహించాలని కూడా KCBC హెచ్చరించింది. పూజలు, ప్రార్ధనలు చెయ్యడం, విగ్రహారాధన క్రైస్తవం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమైనవి కనుక యోగా, ధ్యానం సందర్భంగా వాటికి దూరంగా వుండాలని కూడా కౌన్సిల్ సూచించింది.

కేరళలోని మువత్తుపుజ వద్ద ఒక యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్న క్యాథలిక్ నన్ థెరిస్సా మాత్రం KCBC ఇచ్చిన మార్గ దర్శకాలు అనవసరమని అభిప్రాయపడుతున్నారు. యోగా సాధన ద్వారా తనకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డ  థెరిస్సా క్రైస్తవ పద్ధతిలో కూడా యోగాని సాధన చెయ్యొచ్చని చెబుతున్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతని పొందవచ్చని చెబుతున్న థెరిస్సా ఓంకారాన్ని జపించడాన్ని కూడా వ్యతిరేకించవలసిన అవసరం లేదంటున్నారు.