
నాణేల చలామణిలో భారత రిజర్వుబ్యాంకు మరోసారి కీలక ప్రకటన చేసింది. 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయని స్పష్టం చేసింది. రూపాలు, డిజైన్లలో తేడా ఉన్నా నాణేలన్నీ చెల్లబాటు అవుతాయని, ప్రజలు, దుకాణదారులు వాటిని తీసుకోవాలని కోరింది. నాణేలు చెల్లబాటు కావడం లేదన్న ఉద్దేశంతో ఈ మధ్య వీటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. చివరికి బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చిన ఆర్‌బీఐ మరోమారు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. నాణేలను ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తల్లో నిజం లేదని, అందరూ తప్పకుండా వీటిని తీసుకోవాలని సూచించింది. బ్యాంకులు కూడా లావాదేవీల సమయంలో నాణేలను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
Source : Bharat Today.
http://www.bhaarattoday.com/posts/view/rbi-says-all-coins-must-be-accepted-as-legal-tender/3464





