News

శివయ్య సన్నిధిలో అడ్డగోలు దోపిడీ

318views

శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ప్రవేశ గోపురాల్లో ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్‌, లగేజీ కేంద్రాల్లో అడ్డగోలు దోపిడీతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆయా ప్రవేశ గోపురాల వద్ద ముక్కంటి ఆలయ అధికారులు ధరల సూచికలు ఏర్పాటు చేయించారు. మైక్‌ల ద్వారా అనౌన్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. అయితే నూతనంగా టెండర్‌ దక్కించుకున్న గుత్తేదారులు శివయ్య గోపురం వద్ద ధరల సూచిక బోర్డు కన్పించకుండా చింపేశారు. అనౌన్స్‌మెంట్‌ చేసే భద్రతా సిబ్బందితో అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక్కో సెల్‌ఫోన్‌కి రూ.5 వసూలు చేయాలని నిబంధనలుంటే ఇష్టానుసారం వసూలు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.