
250views
సమాజంలోని హిందువులందరూ దేవాలయాలకు వెళుతూ భక్తి భావం పెంచుకోవాలని నెరవాడ పీఠాధిపతి పాండురంగనాథ భారతీయ స్వామి, రుక్మిణీ మాతాజీ, అనంత నంద భారతి సూచించారు. కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలోని అమ్మవారిశాలలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హిందూ ధర్మ సమ్మేళనం కార్య క్రమం నిర్వహించారు. అమ్మవారిశాల నుంచి అంగళ్ల మెయిన్ బజారు పాతబస్టాండు మీదుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ర్యాలీ నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకు న్నాయి. సాయిరాం, మనోహర్, జి.మాధవరెడ్డి, నాగమోహన్ రెడ్డి, బాలేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, గౌరి హుశేన్ రెడ్డి, మారుతి కృష్ణ, గుండా గోపాల్, కందగడ్డల మోహన్‌రావు, రామ్మూర్తి, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.





