
355views
కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో గత ఆరు నెలలుగా ఏదో ఒక సంఘటనతో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. నిత్యం వేలాది మంది భక్తులు దేశవిదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం తరలి వస్తుంటారు. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. దీనిని అరికట్టేందుకు పాలకమండలి ఒక అడుగు ముందుకు వేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ప్రతిష్ఠ మసకబారకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత దేవాదాయశాఖ ఉన్నతాధికారులపై ఉంది.
ఇవీ ఘటనలు
ఇలాంటి ఘటనలతో భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇలా జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.





