
రాజ్యసభలో శుక్రవారం నమాజ్ కోసం ఇచ్చిన అదనపు 30 నిమిషాల విరామాన్ని ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తొలగించారు. రాజ్యసభలో శుక్రవారం నమాజ్ కోసం ఇచ్చిన అదనపు 30 నిమిషాల విరామాన్ని తొలగిస్తూ రాజ్యసభ నిబంధనలలో మార్పు చేశారు. పార్లమెంటులో అన్ని వర్గాల సభ్యులు ఉన్నారని, కేవలం ముస్లిం పార్లమెంటేరియన్లకు మాత్రమే నిర్దిష్ట మినహాయింపు ఉండదని ఈ మినహాయింపు ఉండటం సరికాదని స్పష్టం చేశారు. లోక్‌సభతో సరిపోయేలా శుక్రవారం సమయాన్ని మార్చినట్లు సభాపతి తెలిపారు. ముఖ్యంగా, లోక్‌సభలో శుక్రవారాల్లో ‘నమాజ్’ విరామం లేదు ఈ పద్ధతి కేవలం రాజ్యసభలో మాత్రమే ఉందని పేర్కొన్నారు. లోక్‌సభ మరియు రాజ్యసభలు పార్లమెంట్‌లో అంతర్భాగమైనందున, సాధ్యమైనంత వరకు ఒకే సమయానికి కట్టుబడి ఉండాలన్నారు.
ఈ నిర్ణయంపై డిఎంకె ఎంపి ఎం. మహ్మద్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. 60-70 ఏళ్లుగా చాలా కాలంగా ఇదే ఆచారం కొనసాగుతోందన్నారు. దీనికి సమాధానంగా పార్లమెంటులో అన్ని వర్గాల సభ్యులు ఉన్నారని, ముస్లిం పార్లమెంటేరియన్లకు మాత్రమే నిర్దిష్ట మినహాయింపు ఉండదని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. తగిన చర్చల తర్వాతనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. గత సెషన్‌లో ఈ సమయ మార్పును అమలు చేశామని, ఇప్పటికే సభ్యులకు వివరించామని చైర్మన్ పునరుద్ఘాటించడంతో, సభలో ఎలాంటి గందరగోళం జరగలేదు.





