News

ఫ్రాన్స్‌లో తమిళ కవి తిరువళ్ళువార్ విగ్రహావిష్కరణ

353views

మనదేశానికి చెందిన ఆధ్యాత్మిక వేత్తలను, ఆయుర్వేదాన్ని, యుద్ధ వీరులను ప్రపంచంలో అనేక దేశాలకు చెందిన ప్రజలు గౌరవిస్తారు. వారి జీవిత గాథలను తమ దేశ ప్రజలకు తెలియజేస్తారన్న సంగతి తెలిసిందే.. తాజాగా తమిళనాడుకు చెందిన ప్రముఖ కవి, తత్వవేత్త, నీతిజ్ఞుడు తిరువళ్ళువార్ ను యూరోపియన్ దేశమైన ఫ్రాన్స్ గౌరవిస్తూ సెర్గి నగరంలో తిరువళ్ళువార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ విషయంపై ప్రధాని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. దక్షిణ భారతదేశంలోని గొప్ప సాధువు, తమిళ సాహిత్యానికి మకుటం వంటి తిరువళ్ళువార్ విగ్రహం భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య ఉమ్మడి సాంస్కృతిక సంబంధాలకు అందమైన నిదర్శనమని అన్నారు. తిరువళ్ళువార్ ను జ్ఞానానికి ప్రతిరూపంగా గౌరవిస్తారని, ఆయన రచనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని ట్వీట్ లో పేర్కొన్నారు.