News

అటవీ భూమిలో నిర్మించ తలపెట్టిన అక్రమ చర్చి తొలగింపు

1.1kviews

ర్నూలు జిల్లాలోని అటవీ భూమిలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించ తలపెట్టిన చర్చిని ప్రభుత్వ అధికారులు తొలగించారు. కల్లూరు మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు ప్రాంతంలోని అటవీ శాఖకు చెందిన స్థలంలో గతంలో కొందరు ఒక శిలువను ఏర్పాటు చేశారు. దానిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఇదే అదనుగా ఇటీవల దాని పక్కనే ఒక చర్చిని నిర్మించేందుకు పునాదులు వేశారు.

హైదరాబాదుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం’ ఈ వ్యవహారంపై కర్నూలు జిల్లా కలెక్టర్, రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది. అటవీ శాఖకు చెందిన భూమిని ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవలసిందిగా కోరింది. దీంతో శనివారం రాత్రి స్థానిక ఎమ్మార్వో పర్యవేక్షణలో, పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణంలో ఉన్న చర్చిని తొలగించారు. అన్యాయంగా తమ చర్చిని తొలగించారంటూ కొందరు పాష్టర్లు కర్నూలు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇదిలా ఉండగా కేవలం చర్చిని మాత్రమే తొలగించి, అక్కడ అక్రమంగా ఏర్పాటు చేసిన శిలువను తొలగించకపోవడంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Source : VSK, Telangana.