News

ఆంధ్రప్రదేశ్ లో సమతా సమ్మేళనాలు

202views

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో సామాజిక సమత కోసం సమతా సమ్మేళనాలను నిర్వహిస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసత కన్వీనర్ రాగాల నరసింహరావు నాయుడు తెలిపారు. దురాచారాల నిర్మూలన కోసం అనేక మంది మహా పురుషులు పని చేశారని,వారిని స్మరిస్తూ, వారి ప్రేరణగా కుల అసమానతలు, అస్పృశ్యత లేని, దురాచారాలు లేని హిందూ సమాజం కొరకు అందరం కలసి కృషి చేసేందుకు ఈ సమ్మేళనాలను నిర్వహిస్తునామన్నారు. వివిధ సమతా సమ్మేళనాలలో ధర్మాచార్యులు,పండితులు,సామాజిక నేతలు తమ సందేశాలను ఇచ్చారని పేర్కొన్నారు.

సమతా సమ్మేళనాలు
ఆంధ్ర ప్రదేశ్ లో 1914 లో విజయవాడలో జరిగిన ఆది ఆంధ్ర సమ్మేళనంను స్మరిస్తూ నవంబర్ 6 న విజయవాడలో 800 మందితో,సమతా సమ్మేళనాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలో జూన్ 25 న 1500 మందితో ఉత్తరాంధ్ర సమ్మేళనం, 1925 లో అనంతపురం లో జరిగిన ఆది హిందూ సమ్మేళనంను స్మరిస్తూ,అక్టోబర్ 1 న అనంతపురంలో 1250 మందితో రాయలసీమ జిల్లాల సమతా సమ్మేళనం, నెల్లూరు వెంకయ్య స్వామి ఆశ్రమంలో అక్టోబర్ 8న 2,400 మందితో ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు జిల్లాల సమతా సమ్మేళనం, నూరేళ్ళ క్రితం 1923 కాకినాడ కాంగ్రెస్ జాతీయ మహా సభలో శ్రీ గణపతి ముని సమతా సందేశాన్ని స్మరిస్తూ నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం రోజున కాకినాడలో2,700 మందితో ఉభయ గోదావరి జిల్లాల సమ్మేళనాలను నిర్వహించామని చెప్పారు.ప్రతి సమ్మేళనంలో అనేక వందల గ్రామాల నుండి అన్ని వర్గాల పురుషులు,స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు.

వివిధ సమ్మేళనాలలో పుస్తక ఆవిష్కరణలు
వివిధ సమ్మేళనాలలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలని నిర్వహించినట్లు వివరించారు. డా.బూదాటి వెంకటేశ్వర్లు రాసిన నిరుద్ద భారతం పద్యం అర్థంతో పుస్తకం, ఆచార్య సుబ్బాచారి రాసిన నీరుద్ధ భారతం అర్థంతో పుస్తకం, డా.దుగ్గరాజు శ్రీనివాసరావు రచన కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు, డా.గౌరీశంకర్ ఉత్తరాంధ్రలో సమతా ఉద్యమాలు, వి.వి.సుబ్రమణ్యం; గోదావరీ తీరాన సమతా ఉద్యమ సారథులు, శ్యాం ప్రసాద్ రాసిన మన భారత రాజ్యాంగము ప్రత్యేకతలు వంటి పుస్తకాల ఆవిష్కరణ జరిగాయని తెలిపారు.

ప్రతి సమ్మేళనంలో SSF అధ్వర్యంలో ఎస్సీ కాలనీల్లో నిర్మింపబడిన అనేక కాలనీల నుండి ఎస్సీ పూజారులు,ఎస్సీ పురుషులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఎస్సీ పూజారుల మంత్రోచ్చరణతో సభ ప్రారంభించినట్లు చెప్పారు.

కులాల హెచ్చు తగ్గులు, అస్పృశ్యత ధర్మ సమ్మతం కాదు,మధ్యలో వచ్చిన దురాచారాలు,ఆచరించ తగదు అని వివిధ సభలలో పూజ్య సాధు సంతులు, పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామీ,స్వామి విరజానంద స్వామి, స్వామి శ్రీనివాసానంద, సహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు వంటి వారు తమ సందేశాలని ఇచ్చారని వెల్లడించారు.

కేంద్ర మంత్రులు నారాయణ స్వామి,రాష్ట్ర మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ రాష్ట్ర మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ,ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు.

సమరసతా సాధనలో మహిళల బాధ్యత అనే విషయమై శ్రీమతి కోడూరు జయప్రద, డా.రేణు దీక్షిత్ , శ్రీమతి సుందరి రాణి, శ్రీమతి వింజమూరి సత్య,డా.వోలేటి కనక మహాలక్ష్మి వంటి వారు హాజరయ్యారన్నారు.

SSF ద్వారా జరుగుతున్న సమరశతా ప్రయత్నాల పై తాళ్లూరి విష్ణువు,కోట సునీల్ కుమార్,సాయిరాం లు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ – ఆర్.ఎస్.ఎస్.నాయకులు మనం ముందు ఏమి చేయాలి? అనే అంశంపై అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ , సహ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, రాష్ట్ర సహ కార్యదర్శి దువ్వూరి యుగంధర్, ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య, సహ ప్రాంత ప్రచారక్ జనార్ధన్ లతో సహా ఇతరులు ప్రసంగించారు.ఈ సమతా సమ్మేళనాల్లో సామాజిక సమత కోసం కృషి చేసిన వారిని సన్మానించారు.

ప్రధాన సందేశం
మన ఆచరణ ద్వారా,మన ఇంట్లో,మన గ్రామంలో కులాల హెచ్చు తగ్గులు అస్పృశ్యత లేని పరిస్థితులు నిర్మించాలని తెలియ చేశారు.
ఈ సమతా సమ్మేళనాల అనువర్తి ( follow up )గా
*మండల స్థాయిలో సామాజిక సమరసత వేదిక కమిటీలను వేయాలని
*ప్రతి జిల్లా లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాలలోని అన్ని కులాల యువకులతో సమరసత నిర్మానానికి కార్యక్రమాలు చేపట్టాలని
* సమ్మేళనాలలో వక్తల సందేశాలను బులెటిన్ ద్వారా,వీడియో ల ద్వారా ప్రచారం చేయాలని
* సామాజిక సమత కోసం ఉద్యమించిన మహాపురుషుల చిత్రాలను ఎక్కువ గృహాలలో ఉంచాలని నిర్ణయం అయిందని తెలిపారు.