
సనాతన ధర్మం కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశమే కాదని అది శాస్ర్తీయంగా మానవాళికి మేలు కలిగించే జీవన విధానమని రుజువు చేయబడిందని తెలంగాణా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో 45 రోజుల పాటు నిర్వహించిన భారత భాగ్య సమృద్ధి యజ్ఞంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రధాన యాగస్థలిలో ప్రదక్షణలు చేసి, వేదాశీస్సులు పొందారు. అనంతరం యజ్ఞ నిర్వాహకురాలు మాధవి లత కొంపెల్ల.. గవర్నర్‌ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 45 రోజులపాటు యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఆనందంగా ఉండాలని శివుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఓంకారం నిరంతరం పలకడం మానవ శరీరానికి, మానసికంగా ఎంతో మేలు చేస్తుందని నిరూపణ అయిందన్నారు. మానవ నాడిపై ఓంకారం ఎంతో ప్రభావం చూపుతుందని చెప్పారు. ఇలాంటి యజ్ఞాలు సమాజంలో చెడు ప్రభావాన్ని తగ్గించి మంచిని పెంచుతాయని వివరించారు.





