News

ఇక మదర్సాలలో కూడా సాధారణ పాఠ్యాంశాలు – కేంద్రం ప్రకటన

989views

మామూలుగా బోధించే మత సంబంధమైన అంశాల తోపాటుగా మిగతా విద్యాలయాల్లో బోధించే పాఠ్యాంశాలను కూడా మదర్సాలలో బోధించడం ద్వారా మదర్సా విద్యార్ధులను కూడా జాతి నిర్మాణంలో భాగస్వాములను చెయ్యాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మదరసాలలోని బోధనా సిబ్బందికి సైన్సు, గణితము, కంప్యూటర్స్, ఇంగ్లీషు, హిందీలలో కూడా శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా ప్రధాన విద్యా విధానంలో మదరసా విద్యార్ధులను కూడా భాగస్వాములను చెయ్యగలమని, దాని వలన వారికి ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశాలున్నాయని నఖ్వీ పేర్కొన్నారు.

ముస్లిం బాల బాలికలకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం ద్వారా వారిలో సాధికారతను (3 E’s Education, Employment, Empowerment) పెంచడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ నఖ్వీ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జమైతే ఉలేమా హింద్ ప్రధాన కార్యదర్శి మౌలానా మహ్మూద్ మదాని పేర్కొన్నారు.