
పాకిస్తాన్ ఇస్లామిక్ మతోన్మాదులు హిందూ ప్రార్థనా స్థలాలను, మైనారిటీ హిందువులను వేధించటమే లక్ష్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. ప్రార్థనాస్థలాలే లక్ష్యంగా మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయికి చేరుకుంది.మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడంలో పాకిస్థాన్ ఎప్పుడూ విఫలమతూనే వుంది.తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం సింధ్ ప్రావిన్స్‌లోని హింగ్లాజ్ మాతా మందిరాన్ని అలాగే నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న శారదా పీఠం ఆలయాన్ని కూల్చివేసింది.
పాకిస్తాన్ లోని థార్పార్కర్ జిల్లాలో వున్న హింగ్లాజ్ మాతా మందిరాన్ని కూల్చివేసినట్లు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపారు. పాకిస్తాన్ లో మైనార్టీ హిందువులపై మతోన్మాదుల అరాచకాలు కొనసాగుతున్నాయి. సింధ్ ప్రావిన్స్ లోని చారిత్రాత్మకమైన హింగ్లాజ్ మాతా మందిర్ ను అక్కడి అధికారులు కూల్చేశారని ట్వీట్ పేర్కొన్నారు. థార్ పార్కర్ జిల్లాలోని మిథీ నగరంలో ఉన్న ఈ ఆలయం.. ఆక్రమణలో ఉందంటూ కోర్టు ఉత్తర్వులు చూపిస్తూ.. అధికారులు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాన్ని నేలమట్టం చేశారు. దీంతో ఆగ్రహించిన హిందువులు ఆలయ స్థలంలో సమావేశమై ఆలయం కూల్చివేతపై తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానిక హిందువులు, భక్తులు ఆందోళన చేపట్టారు. హిందూధర్మానికి, హింగ్లాజ్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. మైనార్టీలపై అణచివేతకు.. హింగ్లాజ్ మాతా కూడా బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు హిందూ మత స్థలాలపై అణిచివేత కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు
Pakistani authorities continues crackdown on Hindu religious places. Following an order of anti-encroachment court Mirpurkhas, Hinglaj Mata Mandir has been demolished in Mithi, Tharparkar, Pakistan. pic.twitter.com/EUOHHcXkQt
— Danish Kaneria (@DanishKaneria61) November 23, 2023
శారదా పీఠం మందిరం కూల్చివేత గురించి సేవ్ శారదా కమిటీ సభ్యులు రవీందర్ పండిత ఎక్స్(ట్విటర్) ద్వారా దుర్ఘటనపై తన ఆవేదన వ్యక్తం చేశారు. యునెస్కో సైట్‌గా గుర్తింపు ఆలయాన్ని పరిరక్షించాలనే సుప్రీం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూల్చివేశారని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి మా శారదా సర్వజ్ఞ పీఠం కట్టడం విరిగిపోయిందని అక్కడ ఉన్న రాళ్ళు దూరంగా పడి ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పాక్ సైన్యం చాలా కాలంగా కాపలా కాస్తున్నప్పటికీ ఈ ఘటన జరిగిన విషయాన్ని ప్రపంచం మొత్తం గమనించాలని తెలిపారు.
Disturbing visuals from Sharda peeth PoK ???? Disheartened to see the peripheral wall of our Sharda sarvagnya peeth across LoC in Distt.Neelum broken and stones thereof carted away. Further there are some more encroachments going on. Revealed by our civil society members across LoC… pic.twitter.com/MeVtl8AjVW
— Ravinder Pandita(Save Sharda) (@panditaAPMCC63) November 21, 2023





