News

శ్రీకృష్ణ భక్తుడిగా మారిన ముస్లిం యువకుడు

232views

ఘర్ వాపసీ ద్వారా బీహార్‌కు చెందిన మహ్మద్ జావేద్ హిందూ మతాన్ని స్వీకరించాడు. తన పేరును శిబు కృష్ణ దాస్‌గా మార్చుకున్నాడు. శిబు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు. సనాతన ధర్మాన్ని స్వీకరించిన తర్వాత, మనమందరం పూర్వం హిందువులమని చెప్పాడు. స్వధర్మాన్ని స్వీకరించి తన సొంత మతంలోకి తిరిగి ప్రవేశించడం ఆనందంగా ఉందని శిబు తెలిపాడు.

శిబు కృష్ణదాస్ రాధాకృష్ణులను ఆరాధించే క్రమంలో చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి వచ్చిందని చెప్పాడు. అయినప్పటికీ అన్ని సమస్యల మధ్య ఆ శ్రీకృష్ణ పరమాత్మే మద్దతుగా నిలచి మార్గం చూపించాడని అన్నాడు. తన తల్లిదండ్రులు, బంధువులు తనపై ఒత్తిడి తెచ్చారని అయినా తాను కృష్ణుడిపై ఉన్న భక్తిని వదులుకోలేదని గుర్తు చేసుకున్నాడు. ముస్లిం వర్గానికి చెందిన పలువురు వ్యక్తులు తనను చంపుతామని కూడా బెదిరించారని తెలిపాడు.

శ్రీకృష్ణుడికి భక్తుడిగా మారిన తర్వాత తన తల్లిదండ్రలు భూత వైద్యుల వద్దకు తీసుకెళ్లారని, మానసిక వైద్యులకు కూడా చూపించారని, వారు ఇచ్చిన మందుల ప్రభావం కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లానని శిబు కృష్ణదాస్ తన అనుభవాలను పంచుకున్నాడు. సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత ఒక అలౌకిక ఆనందాన్ని పొందుతున్నానని చెప్పాడు. బృందావనంలో శాశ్వత నివాసం ఏర్పర్చుకోవాలని ఉందని కృష్ణదాస్ తెలిపాడు. తన జీవితాన్ని శ్రీకృష్ణుడికే అంకితం చేశానన్నాడు.