ఊరొదిలి పోతారా? ఉరి తియ్యమంటారా? బీహార్లో ఓ హిందూ కుటుంబానికి ముస్లిముల బెదిరింపు – ఇంట్లోని మహిళలకు లైంగిక వేధింపులు, పురుషుడిపై దాడి

బీహార్ బెగుసరాయి జిల్లాలోని నూర్పూర్ ముస్లిములు ఎక్కువగా నివసించే గ్రామములో బిక్కు బిక్కుమంటూ ఓ రెండు హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయ్. వారిని ఎలాగైనా ఆ గ్రామం నుంచి తరిమెయ్యాలని నిశ్చయించుకున్న కొందరు స్థానిక ముస్లిం యువకులు గత కొంత కాలంగా ఆ గ్రామం విడిచి వెళ్లవలసినదిగా వారిని బెదిరిస్తున్నారు. అన్ని బెదిరింపులనూ సహిస్తూ వాళ్ళు ఎలాగో నెట్టుకొస్తున్నారు.
తల్లి, కుమార్తె, కుమారుడు మాత్రమే వుండే ఒక ఇంటిలోనికి జూన్ 10వ తేది అర్దరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు బలవంతంగా ప్రవేశించి, ఇంటిలోని తల్లీ కూతుళ్ళతో అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. అడ్డుకోబోయిన సోదరుణ్ణి దారుణంగా కొట్టి గాయపరచారు. వారిలో ఒకరిని స్థానిక ఫిరోజ్ ఆలం కుమారుడు లడ్డూ ఆలంగా ఆ కుటుంబ సభ్యులు గుర్తించారు. వారు వారంలోగా ఆ ఇంటిని, గ్రామాన్ని విడిచి వెళ్లవలసినదిగా వారిని హెచ్చరించడమే కాకుండా, తమకు స్థానిక కాంగ్రెస్ నాయకుల అండ ఉందని, పోలీసులకు చెప్పడం గానీ మరే విధమైన సాయం పొందడం గానీ చేస్తే కుటుంబ సభ్యులందరినీ చంపేస్తామని హెచ్చరించడం గమనార్హం. “భజరంగ్ దళ్ వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడలేరు” అని ఆ కుటుంబ సభ్యుల్ని ఆ దుండగులు బెదిరించినట్లుగా వారు పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆ కుటుంబంలోని యువతి మున్నీ కుమారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Family shares the ordeal on intervening night of June 10 and 11 pic.twitter.com/rut91mCdCY
— Swati Goel Sharma (@swati_gs) June 11, 2019
ఆ కుటుంబంలోని ఒకే ఒక పురుషుడు మున్నా కుమార్ మాట్లాడుతూ 200 ముస్లిం కుటుంబాల మధ్య కేవలం రెండే హిందూ కుటుంబాలుండడంతో అక్కడి ముస్లిముల వేధింపులధికంగా ఉన్నాయని, తమ రెండు కుటుంబాలను అక్కడి నుంచి వెళ్ళగొట్టేందుకు వారు శతధా ప్రయత్నిస్తున్నారని, తమకు తమ పూర్వీకులనుంచి సంక్రమించిన ఆ ఇల్లు మినహా మరో ఆధారం లేకపోవడంతో తామెక్కడికీ వెళ్ళలేమని తెలిపాడు. స్థానిక ముస్లిములు కొందరు గత నెలలో కూడా తనపై దాడి చేశారని, ఇప్పుడు కూడా తీవ్ర ప్రతిఘటన, సంఘర్షణ తర్వాత మాత్రమే తాము వారి బారి నుంచి తప్పించుకో గలిగామని, లేకపోతే వారు తమను చంపి ఉండేవారని ఆ యువకుడు భయపడుతూ చెప్పాడు.
Source : Ritam
https://m.ritam.app/Encyc/2019/6/12/women-molested-only-male-member-brutally-assaulted-hindu-family-in-village-of-200-muslim-families-in-beguserai-being-forced-to-vacate-their-ancestral-house-.amp.html





