News

ముంబై ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము

315views

2008 సంవత్సరంలో ముంబైలో జరిగిన ఉగ్రదాడులను భారత్ నెటికి మర్చిపోలేదు. ఈ ఘటన జరిగి నేటికి 15 సంవత్సరాలు అవుతున్న ఆ రోజు ఉగ్రవాదుల చేసిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం నవంబర్ 26 ఉగ్రవాదు ముంబైలోని పలు ప్రాంతాల్లో దాడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో నేడు 26/11 ముంబై ఉగ్రదాడుల మృతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. వీర ఆత్మలను గౌరవించడంలో దేశం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

‘‘ధైర్యవంతుల జ్ఞాపకార్థం మేము వారి కుటుంబాలు, ప్రియమైన వారితో పాటు నిలబడతాము. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వీర భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నాను. వారి అత్యున్నత త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, అన్ని చోట్లా అన్ని రకాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మన ప్రతిజ్ఞను పునరుద్ధరిద్దాం’’, అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు.