News

అహింసను కోరుకునే వారు కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి పోరాడవలసి ఉంటుంది : డా. మోహన్ భగవత్

294views

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ పాల్గొని ప్రసంగించారు. జయం లేదా విజయం అంటే అది ఎల్లప్పుడు ధర్మ విజయమే అని. విజయం ధర్మానుగుణంగా ఉంటుందన్నారు. ధర్మ నియమాలకు అనుగుణంగా విజయం ఉంటుందని, అందుకే అంతిమ ఫలితం కూడా ధర్మంగానే ఉంటుందని అన్నారు. కాబట్టి దాన్ని ధర్మ విజయం అని సంబోధిస్తున్నామని డా. మోహన్ భగవత్ జీ తెలిపారు.

యుద్ధం పై విముఖత ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో చేయాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. మన సనాతన సంస్కృతిలో సత్యం, అహింస ఈ రెండు ప్రాథమికమైనవని అన్నారు. అయితే అహింసను ఆచరించే క్రమంలో అహింసను సంరక్షించుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో పోరాటాల్లో పాల్గొనాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రధాన స్రవంతిలో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని, ధర్మం అందరిని నిలబెడుతుందని ధర్మం కోసం పోరాడాలని డా. మోహన్ భగవత్ జీ పిలుపునిచ్చారు