News

అంతరిక్షం నుంచి తొలి లేజర్‌ సందేశం

299views

అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతమైన ముందడుగు పడింది. అంతరిక్షంలోని 16 మిలియన్‌ కిలోమీటర్ల నుంచి భూమిపైకి తొలి లేజర్‌ సందేశం అందింది. నాసా ప్రకారం.. ఇది భూమి, చంద్రుడి మధ్యదూరం కంటే 40 రెట్లు ఎక్కువ. ఇది ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ రంగంలోనే అతిగొప్ప మైలురాయి. ఈ ప్రయోగం డీప్‌ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్స్‌ (డీఎస్‌ఓసీ) అనే సాధనం ద్వారా సాధ్యమైంది. ఈ సాధనాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ 13న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన సైక్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో పంపించారు. ఆ మరుసటి రోజునుంచే ఈ సాధనం లేజర్‌ సందేశాన్ని భూమిపైకి పంపిస్తున్నది.