News

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాల‌భైర‌వ హోమం

432views

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం శ్రీ కాల‌భైర‌వ‌ హోమం ఘ‌నంగా జ‌రిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో న‌వంబ‌రు 14 నుండి డిసెంబ‌రు 12వ తేదీ వ‌ర‌కు హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్ట‌భైర‌వ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, శ్రీ కాల‌భైర‌వ మూల‌వ‌ర్ల‌కు క‌ల‌శాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, పూజ‌, జ‌పం, హోమం, విశేష దీపారాధన నిర్వహించారు.

హోమ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు నవగ్రహ హోమం జరుగనుంది.