News

3,500 చదరపు అడుగుల అయోధ్య రామ మందిర రంగోళి

270views

దీపావళి పండగ సందర్భంగా గుజరాత్‌లోని సురత్‌లో 3,500 చదరపు అడుగుల అయోధ్య మందిర రంగోళిని అగర్వాల్‌ వికాస ట్రస్ట్‌ యూత్‌ సభ్యులు వేశారు. 50 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో సుమారు 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. మొత్తం 7 రోజుల్లో 26 మంది సభ్యులు కలిసి ఈ రంగోలిని పూర్తి చేశారు. ఇందుకోసం 1000 కిలోల 18 రకాల రంగులను ఉపయోగించారు. ఈ రంగోలిలో రామమందిర నమూనాతో పాటు సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి ప్రతిరూపాలు కూడా రూపొందించారు.ఈ భారీ రంగోలిని ప్రజలు దీపావళి వరకు తిలకించవచ్చు.