News

అన్నవరంలో వైభవంగా సత్య దీక్షాధారణ

385views

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్య దీక్షాధారణ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వందలాది మంది భక్తులు సత్య దీక్షను చేపట్టారు. డిసెంబర్ 4 వరకు 27 రోజుల దీక్ష, ఈ నెల 16 నుంచి డిసెంబర్ 4 వరకు 18 రోజుల దీక్ష, ఈనెల 25 నుంచి డిసెంబర్ 4 వరకు 9వ రోజుల దీక్షను భక్తులు చేపట్టనున్నారు. దేవస్థానంలోని ఉద్యోగులంతా తప్పనిసరిగా సత్య దీక్ష స్వీకరించాలని ఈవో ఆదేశాలతో ఉద్యోగులంతా దీక్ష చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో దీక్షాధారణ చేశారు. వీరికి దేవస్థానం నుంచి ఉచితంగా సత్య దీక్ష వస్త్రాలు, తులసి మాల అందించారు.