News

కాణిపాకంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

249views

కాణిపాక ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో ఆదివారం ముగిశాయి. ఉదయం నుంచి ఆరవ కాలపూజ, అవభృథ హవనం, వ్రత సమర్పణ, మహా పవిత్ర సమర్పణ, ద్రవ్యాహుతి, మహాపూర్ణాహుతి, యాత్రదానం, కలశోద్వాసన, మూల విరాట్‌కు అభిషేకం, చండీయాగం, మహదాశీర్వచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో తదితరులు పాల్గొన్నారు.