News

ఆర్మీకి అందుబాటులోకి ఆధునిక సీసీపీటీ యుద్ధ వాహనాలు

277views

ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆశయ సాధనలో భాగంగా రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌(సీజీఎం) సుధాకర్‌ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా ఉత్పత్తి చేసిన క్యారియర్‌ కమాండ్‌ పోస్ట్‌ ట్రాక్డ్‌(సీసీపీటీ) యుద్ధ వాహనాలను బయటకు తీసే వేడుకను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజీఎం మాట్లాడుతూ.. ఇండియన్‌ ఆర్మీ నుంచి 43 సీసీపీటీ యుద్ధ వాహనాల తయారీకి ఆర్డర్‌ రాగా ప్రయోగాల తర్వాత రెండు వాహనాలను అందించామన్నారు. రెండు సంవత్సరాల్లో మిగిలిన వాహనాలను అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో ఔట్‌స్టాండింగ్‌ సైంటిస్ట్‌ రాజేశ్‌కుమార్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెంగళూరు) జీఎం రాజేంద్ర అవాలే, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.