
హిందీ చిత్రం ‘న్యూటన్’లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేసే అధికారి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న నటుడు రాజ్‌కుమార్ రావ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) జాతీయ ఐకాన్‌గా నియమించింది.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు పొందిన ఈ హిందీ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 90వ ఆస్కార్ అవార్డుల ఎంపికకు అధికారిక నామినేషను కూడా పొందింది. ఓటర్లలో చైతన్యం పెంచి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రముఖులను జాతీయ ఈసీ ఐకాన్‌లుగా నియమిస్తూ ఉంటుంది.
గతంలో ప్రముఖ నటులు పంకజ్ త్రిపాఠి, అమీర్‌ఖాన్, క్రీడాకారులు సచిన్ తెందుల్కర్, ఎం.ఎస్.ధోని, మేరీకోమ్ తదితరులు ఈసీ జాతీయ ఐకాన్‌లుగా వ్యవహరించారు. రాజ్‌కుమార్ నియామకాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు.





