News

అస్సాంలో రూ.11 లక్షల నాణేలతో దుర్గా మండపం

259views

దేశం నలుమూలలా దుర్గా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అస్సాంలోని నాంగావ్‌ జిల్లాలో దుర్గా మండపాన్ని రూ.11 లక్షల విలువైన నాణేలతో వినూత్నంగా ఏర్పాటు చేశారు. రూపాయి, రూ.2, రూ.5 నాణేలు ఉపయోగించి అలంకరించిన ఈ దుర్గా మండపం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పూజా మండపం అలంకరణ కోసం బ్యాంకు నుంచి రూ.10 లక్షల విలువైన నాణేలు, భక్తుల నుంచి విరాళాలుగా మరికొంత మొత్తాన్ని నిర్వాహకులు సేకరించారు. వీటిని ఒక క్రమపద్ధతిలో గోడలపైనంతా అమర్చారు. మండపం పై భాగంలో బంగారు, వెండి నాణేలను అమర్చారు. భక్తులను ఆకట్టుకునే ఉద్దేశంతో ఇలా వినూత్నంగా దుర్గా మండపాన్ని ఏర్పాటు చేసినట్లు శనిమందిర్‌ దుర్గా పూజా కమిటీ తెలిపింది. ఈ మండపానికి ‘కాయిన్స్‌ టెంపుల్‌’గా నామకరణం చేశారు.