News

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కూలెంట్‌ లీక్

240views

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోని తమ ల్యాబ్‌ నుంచి కూలెంట్‌ లీకవుతున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. అయితే అక్కడి వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. 2021లో ఐఎస్‌ఎస్‌కు అనుసంధానించిన ‘నౌకు’ సైన్స్‌ ల్యాబ్‌లోని ప్రత్యామ్నాయ రేడియేటర్‌ నుంచి ఈ లీకేజీ జరుగుతున్నట్లు వివరించారు. దీనికి కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. చిన్నపాటి ఉల్కల ఢీ వల్ల ఇది జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులోనూ ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైన సోయజ్‌ వ్యోమనౌక నుంచి ఇలాగే కూలెంట్‌ లీకైంది. ఫిబ్రవరిలో ప్రోగెస్‌ సరకు రవాణా వ్యోమనౌకలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.