News

అమృత్సర్ లో హెరాయిన్, ఓపియం ప్యాకెట్లతో కూడిన పాక్ డ్రోన్‌.. బీఎస్‌ఎఫ్ స్వాధీనం

316views

అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని అమృత్‌సర్‌లోని ఒక గ్రామం శివార్లలో రెండు హెరాయిన్ మరియు నల్లమందు ప్యాకెట్లతో పాటు డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

పక్కా సమాచారం మేరకు బీఎస్‌ఎఫ్ జవాన్లు అమృత్‌సర్‌లోని హర్డో రాత్తాన్ గ్రామంలో తనికీలు నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో హెక్సా కాప్టర్ డ్రోన్ తో పాటు 6.3 కేజీల హెరాయిన్ ప్యాకెట్, 60 గ్రాముల ఓపియం
ప్యాకెట్ ను హర్డో రాత్తాన్ గ్రామ శివారుల్లో కనుగొన్నారు. ఈ డ్రోన్ పాకిస్తాన్ నుంచి భారత్ భూభాగంలోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

గత కొంత కాలంగా నిషిద్ధ వస్తువులతో కూడిన డ్రోనులు తరచుగా అమృత్సర్ గ్రామాల్లో పట్టుబడుతున్నాయి.