News

ముగిసిన ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనం

433views

దశ మహా విద్యా గణపతిగా భక్తకోటికి దర్శనమిచ్చిన.. ఖైరతాబాద్‌ మహాగణపతి విఘ్నేశ్వరుడి నిమజ్జనం పూర్తయింది. భక్తజన కోలాహలం మధ్య శోభాయాత్రగా హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహాగణపతిని ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్ద ఏర్పాటు చేసిన క్రేన్‌ వద్ద గణేశుడిని గంగమ్మ ఒడికి నిర్వాహకులు చేర్చారు. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్‌ శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా ముగిసింది.