News

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహకరిస్తున్న పోలీస్ డీఎస్పీ అరెస్టు

215views

ఉగ్రవాదుల సహకరిస్తున్న ఓ డీఎస్పీని జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులను కాపాడేందుకు సదరు అధికారి ఏకంగా పోలీసులపై తప్పుడు ఫిర్యాదులు సృష్టించాడని తేలింది. జమ్మూకశ్మీర్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్‌ ఆదిల్‌ ముస్తాక్‌ తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. అతడిని శ్రీనగర్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి ఆరు రోజుల కస్టడీకి తీసుకొన్నారు. జమ్మూకశ్మీర్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్‌ ఆదిల్‌ ముస్తాక్‌.. ఉగ్ర ఆపరేటీవ్‌లకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని దీనిలో ఇరికించాలని యత్నించాడు. అతని పై ఆరోపణలు రుజువ్వవడంతో ముస్తాక్ ను అదుపులోకి తీసుకున్నారు.