News

Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాలు : చిన్నశేష వాహనంపై విహరించిన మలయప్ప స్వామి

90views

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వార‌క కృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. చిన్నశేష వాహనం ప్రాశస్త్యం.. వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.