News

UNESCO : హొయసల దేవాలయాలకు యునెస్కో గుర్తింపు

108views

కర్ణాటకలోని హొయసల రాజవంశానికి చెందిన 13వ శతాబ్దపు దేవాలయాలకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. ప్రసిద్ధి చెందిన బేలూరులోని చన్నకేశవ ఆలయం, హళేబీడులోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయానికి కలిపి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇస్తున్నట్టు యునెస్కో పేర్కొంది. హొయసల దేవాలయాలు ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రబలంగా ఉన్న నగర, భూమిజ, ద్రవిడ శైలుల వంటి వివిధ ఆలయ నిర్మాణ సంప్రదాయాలకు గుర్తింపుగా నిలిచాయి. ఈ దేవాలయాల గోడలపై ఉన్న వాస్తు శిల్పం, శిల్పాలు.. క్లిష్టమైన శిల్పాలను అనువదించడంలో శిల్పుల ప్రతిభను ప్రతిబింబిస్తాయని భారత పురాతత్వ శాఖ (ఏఎస్‌ఐ) వెల్లడించింది. అలాగే ఆలయ గోడల వెంట హిందూ ఇతిహాసాలు, పురాణ కథలను వివరించే శిల్పకళా ఫలకాలను కలిగి ఉండే పద్ధతిని మొదట హొయసలులు ప్రవేశపెట్టారని ఏఎస్‌ఐ పేర్కొంది.