106
అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో వీరభద్రుడికి గురువారం ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ, విభూది.. గంధ జలాలు, సుగంధ ద్రవ్యాలు, జలాలతో అభిషేకాలు, విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.