News

Tirupathi : తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

233views

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది. శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న స్వామివారిని 61,926 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.