రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారతీయ సమన్వయ్ బైఠక్ (సమన్వయ సమావేశం) ఈ రోజు ఉదయం 9 గంటలకు పూణెలో ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ గారు మరియు సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే గారు భారతమాత విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సమావేశాలను ప్రారంభించారు. 2023 సంవత్సరానికి గాను మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ సమావేశంలో సంఘ అనుబంధమైన 36 సంస్థలకు చెందిన 267 మంది కీలక ప్రతినిధులు, 30 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనున్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ- సర్ కార్యవాహలు డాక్టర్ కృష్ణగోపాల్ గారు, డాక్టర్ మన్మోహన్ వైద్య గారు, అరుణ్ కుమార్ గారు, ముకుంద గారు, రామదత్ చక్రధర్ గారు, అఖిల భారత కార్యకారిణీ సదస్యులు భయ్యాజీ జోషి గారు, సురేష్ సోనీ గారు, వి. భాగయ్య గారు, రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ్ సంచాలిక వందనీయ శాంతక్క గారు, కార్యవాహిక అన్నదానం సీతక్క గారు, మహిళా సమన్వయ్ నుంచి చందాతాయ్ గారు, స్త్రీ శక్తి అధ్యక్షురాలు శైలజా గారు, సేవాభారతి మహా మంత్రి రేణు పాఠక్ గారు, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ అధ్యక్షులు రామచంద్ర ఖరాడి గారు, విశ్వహిందూ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ గారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు రాజశరణ్ షాహి గారు, భారతీయజనతాపార్టీ (BJP) జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డా గారు, భారతీయ కిసాన్ సంఘ్ సంఘటన మంత్రి దినేష్ కులకర్ణి గారు, విద్యాభారతి అధ్యక్షుడు రామకృష్ణారావు గారు, మాజీ సైనికుల సేవా మండలి అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది గారు, భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హిరణ్మయ్ పాండ్యా గారు, సంస్కృత భారతి సంఘటన మంత్రి దినేష్ కామత్ గారితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో, జాతీయ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తమ అనుభవాలను తెలియజేయనున్నారు. వాటికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరుగనున్నాయి.వారు తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను ఈ సమావేశాల్లో చర్చిస్తారు.