News

దశాబ్ధాలనాటి భారత అంతరిక్ష కల చంద్రయాన్ 3 మరికొన్ని నిమిషాల్లో….

33views

చంద్రయాన్ -3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని నిమిషాల్లో చందమామపైకి ప్రయాణం మొదలుకానుంది. దీని కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయయాత్రకు సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ గురువారం మధ్నాహ్నం 1.05 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ 25.30 గంటల పాటు నిరాటంకంగా కొనసాగిన అనంతరం బాహుబలి రాకెట్‌గా పిలువబడే ఎల్‌వీఎం3-ఎం4 శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-3తో నింగిలోకి దూసుకెళ్లనుంది. మొదట 24 గంటల కౌంట్‌డౌన్‌తో ప్రారంభించాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, స్వల్పమార్పులు చేసి కౌంట్‌డౌన్‌ను 25.30 గంటలకు పెంచి ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ రాకెట్‌ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్‌-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపనున్నారు. రాకెట్‌ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రయాన్‌-3లో ఉన్నాయి.

మిషన్ చంద్రయాన్-3 గురించి ముఖ్యమైన విషయాలు:

ప్రయోగంలో ఉన్న మూడు మాడ్యూల్స్‌.. మూడు రకాలుగా పనిచేస్తుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌: రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్‌ ఇది. ఈ మాడ్యూల్‌.. రాకెట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరవుతుంది.

  • ఇస్రో ప్రకారం, చంద్రయాన్-3 కింద ఉన్న ఈ మాడ్యూల్ కారణంగా, ఇది చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్, చంద్ర భూభాగంలో రోవర్ రొటేషన్ చేయడం ద్వారా కొత్త సరిహద్దులను దాటబోతోంది.
  • ఇది LVM3M4 రాకెట్ ద్వారా పంపబడుతుంది, ఇంతకుముందు ఈ రాకెట్‌ను GSLVMK3 అని పిలిచేవారు. భారీ పరికరాలను మోసుకెళ్లడం దీని ప్రత్యేకత..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంతరిక్ష శాస్త్రవేత్తలు దీనికి మరో పేరు పెట్టారు. అదేంటంటే.. దీనిని ‘ఫ్యాట్ బాయ్’ అని కూడా అంటారు.
  • చంద్రయాన్-3 జూలై 14న ప్రయోగించబడుతుంది. ఆగస్టు 20- 25 మధ్య అది చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ స్థితిలో ఉంటుంది. చంద్ర ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ .. నడవడం ఎవరి మొదటి పని.

ఈ సాధనానికి నాలుగు కాళ్లు, నాలుగు ల్యాండింగ్ థ్రస్టర్లు (రాకెట్లు) ఏర్పాటుచేశారు. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడానికి అవసరమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చారు. అవి ప్రమాదకరమైన అవరోధాలను తప్పించుకోవడానికి, ల్యాండర్కు తాను ఎక్కడ ఉన్నానన్న విషయం తెలియజేయడానికి ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ కోసం ఎక్స్ బ్యాండ్ యాంటెన్నా ఉంటుంది. ల్యాండర్లో 800 న్యూటన్ల సామర్థ్యం కలిగిన నాలుగు థ్రాటలుల్ ఇంజిన్లు, 58 న్యూటన్ల సామర్థ్యం కలిగిన 8 థ్రాటల్బుల్ ఇంజిన్లు ఉన్నాయి. ల్యాండర్లో మొత్తం ఐదు పరికరాలు ఉన్నాయి. అవి..

  • చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్ పెరిమెంట్ (చేస్ట్): చంద్రుడి కండక్టివిటీ, ఉష్ణోగ్రతలను కొలుస్తుంది.
  • ఇన్స్ట్రూమెంట్ ఫర్ లూనార్ సైస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ): ల్యాండింగ్ ప్రదేశంలో చంద్రుడి ప్రకంపనలను కొలవడానికి ఉపయోగపడుతుంది. చందమామ క్రస్టు, మ్యాంటిల్ పొరల తీరుతెన్నులను వెలుగులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.
  • లాంగ్మయిర్ ప్రోబ్: ప్లాస్మా సాంద్రత, దాని వైరుధ్యాలను లెక్కిస్తుంది.
  • ప్యాసివ్ లేజర్ రెట్రోరిఫ్లక్టర్ అరే (ఎల్ఆర్ఎ): దీన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అందించింది. ఇది చంద్రుడికి సంబంధించిన రేంజింగ్ అధ్యయనాల కోసం ఉపయోగపడుతుంది.
  • రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయనోస్పియర్ అండ్ అట్మాస్పియర్ (రంభా): చంద్రుడిపైన ఉండే గ్యాస్, ప్లాస్మా వాతావరణం గురించి శోధిస్తుంది.

చంద్రయాన్ 3 ప్రత్యేకతలు

చంద్రయాన్ -3 ప్రయోగాన్ని ఇస్రో ఒక సవాల్ గా తీసుకుంది. ముఖ్యంగా సైంటిస్ట్లు చంద్రయాన్ – 2 మాదిరిగా సాంకేతిక లోపం తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా టెస్ట్ రన్లు నిర్వహించారు. చంద్రయాన్-3 మిషన్ మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్. ప్రొపల్షన్ స్పేస్ క్రాఫ్ట్ లోని రోవర్, ల్యాండర్న చంద్రునికి 100 కిలో మీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. సీఈ 20 క్రయోజెనిక్ ఇంజిన్ టెస్టింగ్ ఫిబ్రవరిలో విజయవంతమైంది. గత వైఫల్యాలు అధిగమించేలా ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ చంద్రయాన్-3ని ఇస్రో రూపొందించింది. ఎలాంటి సమస్యలు వచ్చినా ల్యాండర్.. సక్సెస్ఫుల్గా చంద్రుడిపై దిగేలా సాంకేతికను జోడించింది. ఈసారి ల్యాండింగ్కు దక్షిణ ధ్రువంలోని విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసింది. ఫ్యూయెల్ కెపాసిటీని కూడా పెంచింది. పరిస్థితులను బట్టి వేరే చోట ల్యాండింగ్ చేసేందుకు కూడా రెడీ అయింది.