News

ఓటు బ్యాంకు కోసం రాజకీయం, సుప్రీమ్ కోర్ట్ మొట్టికాయలు

203views

కేరళ స్టోరీ సినిమాను ప్రదర్శించకుండా నిషేధం విధించడంపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో నిషేధం విధించగా, తమిళనాడులో మాత్రం ప్రదర్శించకుండా థియేటర్లకు బెదిరింపులు వస్తున్నట్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే తొలుత ప్రస్తావించారు. దేశమంతటా ఈ సినిమా ఆడుతుండగా ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రం నిషేధం ఎందుకని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. శాంతి భద్రతల సమస్యల తలెత్తుతుందని నిఘా వర్గాలు చెప్పిన మేరకు నిషేధం విధించినట్టు బెంగాల్‌ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి చెప్పారు. దీనితో ఏకీభవించని ధర్మాసనం సినిమా నచ్చకపోతే ప్రేక్షకులే చూడరుకదా, నిషేధం ఎందుకని వ్యాఖ్యానించింది. తమిళనాడులో ఎలాంటి నిషేధం విఽధించలేదని ఆ రాష్ట్ర తరఫు న్యాయవాది చెప్పారు. అలాంటప్పుడు థియేటర్ల భద్రతకు తీసుకుంటున్న చర్యలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.