News

తిరుమలలో కత్తులతో యువకుల దాడులు

187views

తిరుమలలో యువకులు కత్తులతో దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓ హోటల్‌ వద్ద చోటుచేసుకున్న వివాదం కాస్త.. కత్తులతో తరిమి దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో హెచ్.టి కాంప్లెక్స్ వద్ద భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో పద్మనాభం అనే యువకుడికి చేతికి తీవ్రగాయం అయ్యింది. అతన్ని వెంటనే స్తానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న పేర్కొన్నారు.