
దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నందున దేశంలోని ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం, మంగళవారాలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు దీనిలో పాల్గొంటున్నాయి. మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం హర్యానాలోని ఝజ్జర్‌లో గల ఎయిమ్స్‌ను సందర్శించిటన్లు అధికారులు తెలిపారు.
దీనికి ముందు దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్‌ను పర్యవేక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరేందుకు మాండవ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలను పరిష్కరించగల సామర్థ్యాన్ని విశ్లేషించాలని రాష్ట్ర, జిల్లా ఆరోగ్య శాఖలను కోరారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో.. ఇన్‌ఫ్లుఎంజా, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ కేసుల ట్రెండ్‌ను తనిఖీ చేయడం, టెస్టింగ్, టీకాలను పెంచడం, హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంసిద్ధతను నిర్ధారించడం లాంటివి అధికారులు పర్యవేక్షించాలన్నారు.
ఎమర్జెన్సీ హాట్‌స్పాట్ లను గుర్తించాల్సిన అవసరాన్ని కూడా మాండవియ తెలియజెప్పారు. కాగా దేశంలో కోవిడ్ కేసులు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి, రోజువారీ కేసులను చూసుకుంటే ఏప్రిల్ 1న 2,994, 2న 3,824, 3న 3,641, 4న 3,038, 5న 4,435, 6న 5,335. ఏప్రిల్ 7న 6,050 ఏప్రిల్ 8న 6,155 కేసులు నమోదయ్యాయి. ఆదివారం నాటికి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 32,814గా ఉంది, రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.





