News

ఆలయ ఉత్సవంలో ఖురాన్‌ పఠనంపై బజరంగ్‌దళ్‌ ఆగ్రహం

405views

కర్ణాటక రాష్ట్రం బేళూరులోని చారిత్రాత్మక చెన్నకేశవ ఆలయంలో మంగళవారం జరిగిన రాష్ట్రోత్సవ సందర్భంగా ముస్లిం మత గురువు ఖురాన్‌ సూక్తులు పఠించడంపై బజరంగ్‌దళ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ ఉత్సవాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆలయ వార్షిక రథోత్సవం సందర్భంగా ఇదే అంశంపై బజరంగ్‌దళ్‌ నిరసన, అనంతరం ఓ ముస్లిం యువకుడి నినాదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని హాసన్‌ జిల్లా ఎస్పీ హరిరామ్‌శంకర్‌ హెచ్చరించారు.