లండన్ భారత హైకమిషన్ కార్యాలయంలోని భారత జాతీయ పతాకాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు, వేర్పాటువాదులు తొలిగించేందుకు ప్రయత్నించినట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దిల్లీలోని బ్రిటిష్ సీనియర్ దౌత్యవేత్తకు ఈ మేరకు నోటీసులు పంపించింది. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి భద్రత లేకపోవడం గురించి ప్రశ్నిస్తూ ఆదివారం రాత్రి బ్రిటిష్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు పంపించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
భారత ఎంబసీ ప్రాంగణం, అక్కడ పనిచేస్తున్న వారి భద్రత పట్ల బ్రిటన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, ఇది ఆమోదయోగ్యం కాదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి, వారిని అరెస్టు చేయాలని విదేశీ వ్యవహారాల శాఖ డిమాండ్ చేసింది. భారత హైకమిషన్ ప్రాంగణంలో జరిగిన ఘటనను దిల్లీలోని బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎలిక్స్ ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు