News

నాల్గవ విడత పోలింగ్లో 61.62% ఓటింగ్ నమోదు.

687views

దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్టాలలో ఈరోజు జరిగిన నాల్గవ విడత పోలింగ్ లో 61.62% ఓటింగ్ నమోదయ్యింది. ఈ సాయంత్రం 7గంటలకు కడపటి వార్తలందేసరికి ఈనాటి ఓటింగ్ శాతం 61.62 గా తెలుస్తోంది. ఈరోజు మొత్తం 9 రాష్ట్రాలలో పోలింగ్ జరగగా వాటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 76.59 ఓటింగ్ శాతం నమోదవగా, కల్లోలిత రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా 9.79% శాతం నమోదయింది. కడపటి వార్తలందేసరికి ఆయా రాష్ట్రాలలోని ఓటింగ్ శాతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బీహార్ 58.92%, జమ్మూ కాశ్మీర్ 9.79%, మధ్య ప్రదేశ్ 66.36%, మహారాష్ట్ర 55.22%, ఒడిశా 64.05%, రాజస్తాన్ 66.27%, ఉత్తర ప్రదేశ్ 54.87%, వెస్ట్ బెంగాల్ 76.59%, జార్ఖండ్ 63.77%