News

వినూత్నంగా సేవా భారతి హోళీ సంబరాలు

259views

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ సేవా భారతి హోళీ సంబరాలు ఈసారి ప్రత్యేకంగా జరిగాయి. శిఖండి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లను ప్రత్యేకంగా ఆహ్వానించి, వేడుకలను నిర్వహించారు. ఈ సంస్థ ఆహ్వానం మేరకు వచ్చిన ట్రాన్స్‌జెండర్లను వేదికపైకి ఆహ్వానించారు.

మహా భారతంలో ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజుకు కుమార్తె జన్మించింది. ఆమె ఆ తర్వాత పురుషునిగా మారడంతో శిఖండి అయింది. అందుకే ట్రాన్స్‌జెండర్లను శిఖండి భాయి, బెహన్ అని సేవా భారతి ప్రతినిధులు పిలుస్తున్నారు.

ఆరెస్సెస్, సేవా భారతి నిర్వహించే హోళీ సంబరాల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. ఢిల్లీలోని సేవా భారతి ప్రధాన కార్యాలయంలో ఈ సంబరాలు ఆదివారం జరిగాయి. ఎల్‌జీబీటీ కమ్యూనిటీని సమాజంలో గౌరవించాలనే లక్ష్యంతో ఆరెస్సెస్ పని చేస్తోంది. ఈ వర్గంవారు కూడా సనాతన ధర్మంలో భాగమేనని నిర్వాహకులు తెలిపారు. ఈ వర్గంవారి కోసం ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ చర్యలను కూడా ఆరెస్సెస్ నిర్వహిస్తోంది.