
326views
చార్‌ధామ్ యాత్రికుల యాత్ర సజావుగా సాగేందుకు గాను ఉత్తరాఖండ్ సర్కారు కొత్త ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాత్రికులు ప్రయాణించే దారుల్లో మూసివేసిన దారులు లేదా దారి మారాల్సిన మార్గాల గురించి గూగుల్ మ్యాప్స్, మ్యాపిల్ యాప్‌ల ద్వారా సమాచారం అందించనుంది. యాత్ర జోరుగా సాగుతున్న సమయంలో ప్రమాదాలు, కొండచరియలు విరిగిపడటం, వాతావరణం సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో దారులను అధికారులు మూసివేస్తుంటారు. అలాంటి సమయంలో ఈ ఏర్పాటు యాత్రికులకు ఉపకరిస్తుందని ప్రభుత్వాధికారులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.





