News

కాశీ ఆలయంలో చిరుధాన్యాలతో ప్రసాదం

293views

చిరుధాన్యాల (మిల్లెట్స్‌)ను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వారాణసీలోని కాశీ విశ్వనాథుని ఆలయం కూడా తన వంతు చర్యలకు ఉపక్రమించింది. చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డూను భక్తులకు అందించనుంది. ఈ ప్రసాదాన్ని ‘శ్రీ అన్న ప్రసాదం’గా పిలువనున్నట్టు ఓ సీనియర్‌ అధికారి ఆదివారం తెలిపారు. చిరుధాన్యాలు, బెల్లం, నువ్వులు, బాదం, జీడిపప్పు, నెయ్యి, ఖోయాల మిశ్రమంతో శ్రీ అన్న ప్రసాదం తయారు చేస్తారు.